కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రి: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సోమవారం నాంపల్లి బీజేపీ ఆఫీస్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తొలగించాలని చట్టంలో ఎక్కడా ఉందని ప్రశ్నించిన ఆయన.. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతుల్లో అయోమయం సృష్టించడానికే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారని, పంట […]
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సోమవారం నాంపల్లి బీజేపీ ఆఫీస్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తొలగించాలని చట్టంలో ఎక్కడా ఉందని ప్రశ్నించిన ఆయన.. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతుల్లో అయోమయం సృష్టించడానికే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారని, పంట కొనుగోళ్లలోనూ కేంద్రం వాటా ఉందని స్పష్టం చేశారు. రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసేది వ్యాపారమేనన్నారు.