కేసీఆర్ సర్కార్‎కు దినం దగ్గర పడింది

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దాల చరిత్ర కలిగిన సెక్రటేరియట్ లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని సీఎం కేసీఆర్ కావాలనే కూలగొట్టించాడని కానీ, పొరపాటున కూలిపోయిందని అబద్దాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. గుడిని కూలగిట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి దినం కూడా దగ్గర పడిందని, ప్రభుత్వానికి పిండం పెట్టాడానికి పిండం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన శాపనార్ధాలు పెట్టారు. కరోనాను ఎదర్కొవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పేషంట్లకు కనీస వసతులు కూడా […]

Update: 2020-07-10 09:38 GMT

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దాల చరిత్ర కలిగిన సెక్రటేరియట్ లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని సీఎం కేసీఆర్ కావాలనే కూలగొట్టించాడని కానీ, పొరపాటున కూలిపోయిందని అబద్దాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. గుడిని కూలగిట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి దినం కూడా దగ్గర పడిందని, ప్రభుత్వానికి పిండం పెట్టాడానికి పిండం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన శాపనార్ధాలు పెట్టారు.

కరోనాను ఎదర్కొవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పేషంట్లకు కనీస వసతులు కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ లేక రోగులు అల్లాడుతున్నారని, వాళ్లు ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు ధైర్య చెప్పాల్సిన సీఎం.. పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు

Tags:    

Similar News