అందరికి ఆదర్శప్రాయుడు రాముడు

దిశ, కంటోన్మెంట్: రాముడు అన్ని వర్గాలవారికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు అన్నారు. ఆదివారం బోయినపల్లి, జయనగర్ కాలనీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కర సేవకుల సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాముడు అందరికి ఆదర్శప్రాయుడని, రాముడు సుగుణాలున్న కొడుకుగా, సోదరురులకు మంచి అన్నగా, గొప్ప పాలకునిగా అందరికీ ఆదర్శనీయుడని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రామమందిరం, 370 ఆర్టికల్ గుర్తుకు వస్తాయని అన్న నేతల నోర్లు మూయించేలా […]

Update: 2020-08-09 08:31 GMT

దిశ, కంటోన్మెంట్: రాముడు అన్ని వర్గాలవారికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు అన్నారు. ఆదివారం బోయినపల్లి, జయనగర్ కాలనీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కర సేవకుల సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాముడు అందరికి ఆదర్శప్రాయుడని, రాముడు సుగుణాలున్న కొడుకుగా, సోదరురులకు మంచి అన్నగా, గొప్ప పాలకునిగా అందరికీ ఆదర్శనీయుడని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడు రామమందిరం, 370 ఆర్టికల్ గుర్తుకు వస్తాయని అన్న నేతల నోర్లు మూయించేలా ప్రధాని మోడీ రామమందిర నిర్మాణానికి పునాది రాయి వేశాడన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ ఇంచార్జి మాచర్ల శ్రీనివాస్, బీజేపీ శంకర్, కృష్ణ మోహన, సంతోష్, శుభం యాదవ్, అక్షయ్ మేరు పాల్గొన్నారు.

Tags:    

Similar News