BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే చేసిన పనికి ‘షాక్‌’లో డాక్టర్లు.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. గుజరాత్‌ సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో బీజేపీ నేతలు ఓ ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ఐసోలేషన్ కేంద్రానికి కామ్‌రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడి ఝలవాడియా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కరోనా రోగికి రెమిడెసివర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]

Update: 2021-05-24 01:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. గుజరాత్‌ సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో బీజేపీ నేతలు ఓ ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ఐసోలేషన్ కేంద్రానికి కామ్‌రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడి ఝలవాడియా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన కరోనా రోగికి రెమిడెసివర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో తరగతి విద్యార్హతలు ఉన్న అతను.. కరోనా రోగికి టీకా ఎలా వేస్తారని కాంగ్రెస్ నేతలు అతడిని టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసమే కరోనా రోగులకు ఇంజెక్షన్​వేస్తూ ఫొటో సెషన్​పెట్టుకున్నారని విమర్శించారు.

తాజాగా ఈ వీడియోపై ఎమ్మెల్యే ఝలవాడియా స్పందిస్తూ.. తాను కరోనా బాధితుడికి ఇంజెక్షన్​వేయలేదని కెమికల్ లిక్విడ్ మిక్స్ మాత్రమే చేశానని అన్నారు. కరోనా రోగులకు రెమిడెసివర్ ఇచ్చి హాని తలపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఇంజెక్షన్ వేసే సమయంలో తన పక్కన 10 మంది వైద్యులు ఉన్నట్టు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News