మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం..
దిశ, వెబ్‌డెస్క్ : తనను బెదిరించి, అత్యాచారం చేయడంతోపాటు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆగస్ట్ 16న ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపైన ఈ కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి ఎమ్మెల్యే మహేశ్ నేగి.. తన డీఎన్ఏ శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. గురువారం కేసు విచారణ చేపట్టిన కోర్టు.. జనవరి 11వ తేదీన సీజేఎం కోర్టు సమక్షంలోఎమ్మెల్యే నేగి తన డీఎన్ఏ […]
దిశ, వెబ్‌డెస్క్ : తనను బెదిరించి, అత్యాచారం చేయడంతోపాటు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆగస్ట్ 16న ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపైన ఈ కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి ఎమ్మెల్యే మహేశ్ నేగి.. తన డీఎన్ఏ శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. గురువారం కేసు విచారణ చేపట్టిన కోర్టు.. జనవరి 11వ తేదీన సీజేఎం కోర్టు సమక్షంలోఎమ్మెల్యే నేగి తన డీఎన్ఏ శ్యాంపిళ్లను ఇవ్వాలని ఆదేశించింది.
అయితే ఎమ్మెల్యే నేగి ఆరోగ్యంగా లేరని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
తనపై అత్యాచారానికి పాల్పడకపోతే ఎమ్మెల్యే డీఎన్ఏ శాంపిల్స్ ఇవ్వవచ్చుగా అని బాధిత మహిళ పేర్కొంది. అత్యాచారం చేశాడు కాబట్టే వెనకంజ వేస్తున్నాడని ఆరోపించింది. తన బిడ్డకు ముమ్మాటికి
ఎమ్మెల్యే మహేశ్ నేగినే తండ్రి అని చెప్పింది. అయితే తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే సదరు మహిళ తనపై కేసు పెట్టిందని ఎమ్మెల్యే నేగి కొట్టిపారేశారు. కాగా ఈ కేసులో ఎమ్మెల్యే భార్య రీటా నేగిపై కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా కేసు నమోదైంది.