ఎమ్మెల్యే రాజాసింగ్ హీరోగా ఎంట్రీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్లాన్!
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్సే రాజాసింగ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి మాట సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా హిందూధర్మ ప్రచారంలో ఎప్పడూ ముందుండే ఈ గోషామాల్ ఎమ్మెల్యే, గోరక్షణ తన ప్రధాన కర్తవ్యం అని పలుమార్లు చెప్పడం మనం విన్నాం. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో హీరోగా ఎమ్మెల్యే రాజాసింగ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ […]
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్సే రాజాసింగ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి మాట సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా హిందూధర్మ ప్రచారంలో ఎప్పడూ ముందుండే ఈ గోషామాల్ ఎమ్మెల్యే, గోరక్షణ తన ప్రధాన కర్తవ్యం అని పలుమార్లు చెప్పడం మనం విన్నాం. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో హీరోగా ఎమ్మెల్యే రాజాసింగ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శంభాజీ పాత్రను రాజాసింగ్ పోషించనున్నారు. శంభాజీ మూవీకి తగ్గట్లు మారేందుకు ఇప్పటికే ఆయన ఫిట్‌నెస్ కోసం వ్యాయామం లాంటి కసరత్తులు ప్రారంభించారు. అంతేగాకుండా అతిత్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని స్వయంగా రాజాసింగ్ చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో, నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనే శంభాజీ. ఆయన శివాజీ కంటే డేంజర్. ఔరంగజేబు తన సైన్యం మొత్తాన్ని దింపి వెతికినా శివాజీ దొరకలేదు. శివాజీ మరణించిన తర్వాత.. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారు. శంభాజీ చరిత్ర చాలా బాగుంది. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని, అందులో నేనే నటించాలని అనుకున్నా. నా బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గాను. ఆయన బాడీ ఎలా ఉందో.. ఫిజిక్ ఎలా ఉందో..అలా కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నా. తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీస్తాం. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నాం” అని రాజాసింగ్ పేర్కొన్నారు.