జైలు నుంచి బీజేపీ నేత‌లు విడుద‌ల‌

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 44మంది బీజేపీ నాయ‌కులు బుధ‌వారం రాత్రి విడుద‌ల‌య్యారు. వీరిని ఇద్దరు వ్యక్తులు, రూ.10వేల పూచీకత్తుపై విడుదల చేస్తూ ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కె.కుమారస్వామి బెయిల్‌ మంజూరు చేశారు. విడుద‌లైన వారిలో బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, రాష్ట్ర నాయకులు చాడా శ్రీనివా్‌సరెడ్డి, […]

Update: 2021-02-03 20:39 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 44మంది బీజేపీ నాయ‌కులు బుధ‌వారం రాత్రి విడుద‌ల‌య్యారు. వీరిని ఇద్దరు వ్యక్తులు, రూ.10వేల పూచీకత్తుపై విడుదల చేస్తూ ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కె.కుమారస్వామి బెయిల్‌ మంజూరు చేశారు. విడుద‌లైన వారిలో బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, రాష్ట్ర నాయకులు చాడా శ్రీనివా్‌సరెడ్డి, జి.శివకుమార్‌, రత్నం, సతీ్‌షషా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతో్‌షరెడ్డి, బాకం హరిశంకర్‌తో పాటు మొత్తం 44 మంది ఉన్నారు.

బుధ‌వారం రాత్రి వ‌రంగ‌ల్‌ జైలు నుంచి విడుదలైన వీరికి బీజేపీ నాయ‌కులు, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. స్వాగ‌తం ప‌లికిన వారిలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి గుండు విజయరామారావు, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, ఎమ్మెల్సీ రామచంద్రారావు, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, డాక్టర్‌ విజయచందర్‌ తదితర నేతలు ఉన్నారు. అనంత‌రం భారీబందోబ‌స్తు మ‌ధ్య వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు నుంచి సుబేదారిలోని అమ‌ర‌వీరుల స్తూపం వ‌ర‌కు ర్యాలీ కొన‌సాగింది. అక్కడి నుంచి హంటర్‌ రోడ్డులోని బీజేపీ అర్బన్‌ జిల్లా కార్యాలయానికి చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది.

Tags:    

Similar News