తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు.. కేసీఆర్‌పై విమర్శలు
దిశ, గండిపేట్ : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గండిపేట్ మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ఇచ్చిన పిలుపుమేరకు.. శాంతియుతంగా (అమరుడు) శ్రీకాంత్ చారి ఆత్మబలిదానం చేసుకున్న ఎల్బీనగర్ చౌరస్తా నుంచి కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వరకు బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు నాయకులు తరలివెళ్లారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా నాయకులను అరెస్టు చేసి పోలీసులు పోలీస్ […]
దిశ, గండిపేట్ : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గండిపేట్ మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ఇచ్చిన పిలుపుమేరకు.. శాంతియుతంగా (అమరుడు) శ్రీకాంత్ చారి ఆత్మబలిదానం చేసుకున్న ఎల్బీనగర్ చౌరస్తా నుంచి కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వరకు బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు నాయకులు తరలివెళ్లారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా నాయకులను అరెస్టు చేసి పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా గండిపేట్ మండలం తహసీల్దార్‌కు నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణిచివేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా తెలంగాణలో ఉద్యోగాలు మాత్రం ఇవ్వటం లేదన్నారు. తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు నియామకాలు అమలు చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. ఇంతవరకు ఉద్యోగాల ఊసే ఎత్తటం లేదన్నారు. దీంతో తెలంగాణలో చదువుకున్న యువకులు మళ్లీ ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇక మీదటనైనా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.