టీఆర్ఎస్‌కు షాక్.. ‘ఎమ్మెల్యే గారు దయచేసి రాజీనామా చేయండి’
దిశ, భువనగిరి రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్‌తో భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ నేతలు భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ‘సర్ అభివృద్ధి కోసం రాజీనామా చేయండి’ అంటూ సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఏకంగా పట్టణ కేంద్రంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఫోటోతో బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారయణ […]
దిశ, భువనగిరి రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్‌తో భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ నేతలు భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ‘సర్ అభివృద్ధి కోసం రాజీనామా చేయండి’ అంటూ సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఏకంగా పట్టణ కేంద్రంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఫోటోతో బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారయణ రెడ్డి పేరుతో ‘ఎమ్యెల్యే సారూ రాజీనామా చెయ్” అంటూ ప్లేక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చిన చోట అధికార పార్టీ హద్దులకు మించి వరాల జల్లు కురిపిస్తోందని అన్నారు. అందుకు ఉదాహరణగా దుబ్బాక, నాగార్జున సాగర్ ఉండగా ఇప్పుడు హుజూరాబాద్‌లోనైతే ఏకంగా ‘దళితబంధు’ పథకంతో హుజురాబాద్ దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వనుందని వెల్లడించారు. ‘‘అలాగే భువనగిరి నియోజకవర్గంలో మీరు(ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి) కూడా మా మీద ప్రేమతో పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఇక్కడ కూడా అధికార పార్టీ ఓట్ల కోసం ఏదో ఓ పథకం తీసుకొస్తుంది. అప్పుడు మేం కూడా బాగుపడుతాం, దయచేసి రాజీనామా చేయండి’’ అని ఆయన అన్నారు.