ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వైరా మండల కేంద్రంలో శనివారం ఉదయం బీజేపీ నేత నెలవెల్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రామారావు తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రామారావు మృతి చెందారు. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో […]
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వైరా మండల కేంద్రంలో శనివారం ఉదయం బీజేపీ నేత నెలవెల్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రామారావు తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రామారావు మృతి చెందారు. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ నేత హత్య జరగడంతో టెన్షన్ నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.