పవన్ పెద్దమనసుతో ఒప్పుకున్నారు : లక్ష్మణ్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శుక్రవారంతో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అన్ని పార్టీలు ప్రచారాలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో జనసేన అధితనే పవన్ కళ్యాణ్‌తో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. అనంతరం ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శుక్రవారంతో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అన్ని పార్టీలు ప్రచారాలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో జనసేన అధితనే పవన్ కళ్యాణ్‌తో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. అనంతరం ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… గ్రేటర్‌లో జనసేనతో కలిసి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తాం అని తెలిపారు. దుబ్బాక ఎన్నికల మాదిరిగానే గ్రేటర్ ప్రజల నమ్మకాన్ని కూడా గెలుచుకుంటామని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కూడా జనసేన, బీజేపీ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీకి జనసేన తోడుంటే… పూర్తిస్థాయిలో మార్పు సాధ్యం అవుతుందని అన్నారు. అంతేగాకుండా గ్రేటర్‌లో బీజేపీ తరపున ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్దమనసుతో ఒప్పుకున్నారని తెలిపారు.