ఎల్లుండి నిశ్శబ్ద విప్లవం : కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదని, తమది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదల మూలంగా హైదరాబాద్‌లో 40 మంది చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క కుటుంబాన్ని అయినా ఓదార్చారా? అని ప్రశ్నించారు. అంతేగాకుండా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులు ఎందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదని, తమది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదల మూలంగా హైదరాబాద్‌లో 40 మంది చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క కుటుంబాన్ని అయినా ఓదార్చారా? అని ప్రశ్నించారు.
అంతేగాకుండా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులు ఎందుకు వచ్చారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, వరదల సమయంలో తమ పార్టీ నేతలంతా బాధితులను పరామర్శించారని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన, హుస్సెన్ సాగర్ గురించి టీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అమిత్ షా పర్యటనతో ఒక జోష్ వచ్చిందని అన్నారు. ఎల్లుండి ఒక నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు ఓట్లు వేయబోతున్నారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న ఉత్సాహం, ఊపు మరే ఇతర ఎన్నికల్లో కనిపించలేదని అభిప్రాయపడ్డారు. మేయర్ పీఠాన్ని బీజేపీ గెలిచి తీరుతుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు, ఈ ఎన్నికల నుంచే మొదలు అవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే, బీజేపీకి ఓటు వేయాలని కోరారు.