‘దీదీ ‘ఇగో’ కారణంగా బెంగాల్ రైతులు వాటికి దూరం’
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం బెంగాల్‌లో పర్యటించిన నడ్డా నదియాలో బీజేపీ పరివర్తన్ రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మమతా పాలనపై నిప్పులు చెరిగారు. దీదీ ప్రభుత్వ హయాంలో బెంగాల్ రైతులను లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను పీఎం కిసాన్ పథకానికి దూరం చేశారని మండిపడ్డారు. తన అహంకారం […]
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం బెంగాల్‌లో పర్యటించిన నడ్డా నదియాలో బీజేపీ పరివర్తన్ రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మమతా పాలనపై నిప్పులు చెరిగారు. దీదీ ప్రభుత్వ హయాంలో బెంగాల్ రైతులను లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను పీఎం కిసాన్ పథకానికి దూరం చేశారని మండిపడ్డారు. తన అహంకారం వల్లే బెంగాల్‌లో నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ రాష్ట్ర ప్రజలు మమతకు, ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ‘టాటా’ చెప్పడం ఖాయమని అన్నారు. మమతా ‘ఇగో’ కారణంగా ఇక్కడి రైతులు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారన్నారు. తన అహాన్ని తృప్తి పరచేందుకే రైతు సంక్షేమ పథకాల అమలుకు అంగీకరించడంలేదని విమర్శించారు.