ఎంపీగా మీరేం చేస్తారు: జనార్ధన్‌రెడ్డి

దిశ, రంగారెడ్డి: ఎంపీ రంజిత్‌రెడ్డి అభివృద్ధి పేరుతో కాలక్షేపం చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి బి.జనార్థన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఆరు నెలల్లో 111 జీవోను రద్దు చేయిస్తానన్న రంజిత్ రెడ్డి గెలిచిన తరువాత ఆ ఊసెత్తడం లేదన్నారు. మరో మూడేళ్లలో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా చేస్తామని ఎంపీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు […]

Update: 2020-05-24 08:23 GMT

దిశ, రంగారెడ్డి: ఎంపీ రంజిత్‌రెడ్డి అభివృద్ధి పేరుతో కాలక్షేపం చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి బి.జనార్థన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఆరు నెలల్లో 111 జీవోను రద్దు చేయిస్తానన్న రంజిత్ రెడ్డి గెలిచిన తరువాత ఆ ఊసెత్తడం లేదన్నారు. మరో మూడేళ్లలో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా చేస్తామని ఎంపీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంటే నోరు మెదపడం లేదన్నారు. బీజేపీ ఎంపీలు నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారని.. మరి టీఆర్ఎస్ ఎంపీగా మీరు ఏం చేస్తారని జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని ఆయన హితువు పలికారు.

Tags:    

Similar News