ఏపీ బీజేపీలో మరో నేతపై వేటు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీలో మరో నేతపై వేటు పడింది. అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ‘రాజధానిపై కేంద్రం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం అమోదయోగ్యంగా లేవు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు చేసిన వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు మిమ్మలిని పార్టీ […]

Update: 2020-08-09 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీలో మరో నేతపై వేటు పడింది. అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

‘రాజధానిపై కేంద్రం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం అమోదయోగ్యంగా లేవు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు చేసిన వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు మిమ్మలిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ లేఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు. కాగా, ఇటీవల మూడు రాజధానులపై ఓ పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో బీజేపీ నుంచి రమణను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News