బీజేపీ మేనిఫెస్టో విడుదల
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేసింది. గురువారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫేస్టోను రూపొందించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘమైన పోరాటం జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో […]
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేసింది. గురువారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫేస్టోను రూపొందించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘమైన పోరాటం జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.
బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలు:
గ్రేటర్లో గెలిస్తే సెప్టెంబర్ 17 అధికారిక నిర్వహణ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
వరద సాయంగా బాధితులకు రూ.25 వేలు సాయం
ఎల్ఆర్ఎస్ రద్దు
బడుగు బలహీనవర్గాలకు వందశాతం మేలు
గ్రేటర్ పరిధిలో లక్ష మంది పేదలకు ఇళ్ల పంపిణీ
మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు
హైదరాబాద్లో హైక్వాలిటీ వైఫై
ఎస్సీలకు ఆస్తిపన్ను పూర్తిగా రద్దు
ఎస్సీలు నిర్మించుకునే 125 గజాలలోపు ఇళ్లకు ఉచిత అనుమతులు
గృహ అవసరాలకు నీటి సరాఫరా ఫ్రీ
రూ.10వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాం
పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాల తొలగింపు