రాత్రికి రాత్రే పైసలు పంచుతున్నారు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్, కొందరు పోలీసు అధికారులు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయాలని ఆయన కోరారు. మా సహనాన్ని ఓపికను, మంచితనాన్ని పిరికితనంగా భావించరాదని విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పైసలు పంపించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో పోలీసులే పైసలు పంచే వారికి […]

Update: 2020-11-29 11:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్, కొందరు పోలీసు అధికారులు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయాలని ఆయన కోరారు. మా సహనాన్ని ఓపికను, మంచితనాన్ని పిరికితనంగా భావించరాదని విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పైసలు పంపించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో పోలీసులే పైసలు పంచే వారికి సపోర్టు చేస్తున్నారని మండిపడ్డాడు.

మైలార్‌దేవ్‌పల్లిలో పైసలు పంచుతుండగా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తే… కేసు నమోదు చేయడం లేదని, గుడిమల్కాపూర్ లో రూ.40 లక్షలు పట్టుకున్నా కేసు నమోదు చేయలేదు, అడిక్‌మెట్‌లో, మన్సూరాబాద్‌లోని బలాజీనగర్‌లో పైసలు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారని ఆయన వివరించారు. జగద్గిరిగుట్టలో పట్టించిన బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుపుతున్నారని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. చర్యలు తీసుకునేవరకూ వేచి చూస్తామని చెప్పారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, సమయమిస్తే గవర్నర్‌కు ఫిర్యాదు చేయదలిచామని చెప్పారు.

Tags:    

Similar News