కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలి : బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి కండూవా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు చేయరు.. సచివాలయానికి రారు అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎన్ని జిల్లాల్లో పర్యటించారో షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా కేటీఆర్‌ను […]

Update: 2021-01-10 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి కండూవా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు చేయరు.. సచివాలయానికి రారు అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎన్ని జిల్లాల్లో పర్యటించారో షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా కేటీఆర్‌ను సీఎం చేయడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపాలా అని ప్రశ్నించారు.

కేసీఆర్ కేబినెట్‌లో పదవుల కోసం టీఆర్ఎస్‌లో కొట్లాట జరుగుతోందన్నారు. కేటీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకోకపోతే… కొత్త పార్టీ పెట్టే యోచనలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని సంజయ్ అభిలషించారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడుతూ.. ‘ఆయన దగ్గరే నేను భాష నేర్చుకోవాలి’ అని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసమే తెలంగాణ సీఎంవో పనిచేస్తోందని విమర్శించారు.

Tags:    

Similar News