మీరెంత..? మీ పార్టీ ఎంత..? :బండి సంజయ్
దిశ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల చేశారు. అదే జరిగితే దారుస్సలాం క్షణాల్లో కూలుతుందని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం పీవీ ఘాట్ ను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పీవీ, ఎన్టీఆర్ అందరికీ ఆదర్శమన్నారు. అయోధ్య విషయంలో పీవీ […]
దిశ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల చేశారు. అదే జరిగితే దారుస్సలాం క్షణాల్లో కూలుతుందని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం పీవీ ఘాట్ ను బండి సంజయ్ సందర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పీవీ, ఎన్టీఆర్ అందరికీ ఆదర్శమన్నారు. అయోధ్య విషయంలో పీవీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రభుత్వం పీవీ జయంతి ఉత్సవాలు జరిపితే సరిపోదు.. సంఘ విద్రోహశక్తులు ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను తాకి చూడండి తమ దమ్మేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ కాలిగోటికి సరిపోదు అక్బరుద్దీన్ పార్టీ, మీరెంత?.. మీ పార్టీ ఎంత.? అని బండి సంజయ్ ప్రశ్నించారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూలుస్తామన్న అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.