చార్మినార్‌పై బీజేపీ జెండా.. రూ.5 వేల ఫైన్!
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు. అయితే యాత్రను చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి మొదలుపెడతామని బండి సంజయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో యాత్రకి సంబంధించిన ఫ్లెక్సీని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీ పై ట్విట్టర్లో విమర్శలు మొదలయ్యాయి. దీనిపై ఓ నెటిజెన్ ఫ్లెక్సీ ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు. అయితే యాత్రను చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి మొదలుపెడతామని బండి సంజయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో యాత్రకి సంబంధించిన ఫ్లెక్సీని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీ పై ట్విట్టర్లో విమర్శలు మొదలయ్యాయి. దీనిపై ఓ నెటిజెన్ ఫ్లెక్సీ ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ట్యాగ్ చేస్తూ ‘‘400 ఏళ్లనాటి మజీదైన చార్మినార్ పై బీజేపీ ఫ్లాగ్ పెట్టిన ఫొటో మతకలహాలను సృష్టించే విధంగా ఉందని’’ చెబుతూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. చార్మినార్ పై జెండా పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పందించిన జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రటరీకి రూ.5000 ఫైన్ వేశారు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందిస్తూ అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సయ్యద్ అబ్దహు కషఫ్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Dear @CPHydCity, #BJP is trying to trigger Communal tension in Hyderbad. A picture of 400+ year old Masjid #Charminar with a BJP Flag on it was put at Abids,Hyd . It also have pictures of PM, HM, BJP MPs and other leaders. We will also register a case today 5:00 PM at Abids PS. pic.twitter.com/Q6ueK1Oekq
— Syed Abdahu Kashaf (@syedKashaf95) August 27, 2021