బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లోకి మహిళా నేత

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు టీఆర్ఎస్ లో చేరింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన 22వ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ రష్మిత ప్రశాంత్ టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. ఆమెతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల […]

Update: 2020-06-16 01:40 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు టీఆర్ఎస్ లో చేరింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన 22వ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ రష్మిత ప్రశాంత్ టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. ఆమెతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. గతవారం రోజుల క్రితం కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ లో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

అయితే.. బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బాధ్యతలు తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ పార్టీ మారడం పార్టీ నాయకులు, కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది.

Tags:    

Similar News