తిరుపతిపై మోడీకి ప్రత్యేక అభిమానం : సోము వీర్రాజు
దిశ, ఏపీబ్యూరో : తిరుపతిపై ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానం ఉందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలో జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం త్వరలో ప్రకటిస్తుందన్నారు. రాయలసీమను చిత్తశుద్దితో అభివృద్ధి చేస్తామని సోమువీర్రాజు హామీనిచ్చారు. ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. అందులో కేంద్రం […]
దిశ, ఏపీబ్యూరో : తిరుపతిపై ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానం ఉందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలో జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం త్వరలో ప్రకటిస్తుందన్నారు. రాయలసీమను చిత్తశుద్దితో అభివృద్ధి చేస్తామని సోమువీర్రాజు హామీనిచ్చారు. ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. అందులో కేంద్రం జోక్యం చేసుకోదని గుర్తుచేశారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.
ఊసరవెల్లిగా మారొద్దు.. ఉండవల్లిపై విష్ణువర్దన్‌రెడ్డి ట్వీట్
ఉండవల్లీ గారూ.. ఊసరవెల్లిగా మారొద్దంటూ గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ట్విటర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎందుకు చేరాలో, ఎందుకు చేరకూడదో చేరే వాళ్లకు తెలుసని పేర్కొన్నారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారని నిలదీశారు. ఏ పార్టీని రాష్ట్రంలో బతికించాలని తాపత్రయ పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.