గెలుపు గుర్రాల కోసం.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ భేటీ
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) ఈరోజు సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనున్నారు. బీజేపీ ఇప్పటికే అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ముగ్గురి పేర్లను ప్రకటించింది. బెంగాల్ కోసం 60 మంది పేర్లను ఖరారు చేసింది. మరోవైపు, […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) ఈరోజు సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనున్నారు. బీజేపీ ఇప్పటికే అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ముగ్గురి పేర్లను ప్రకటించింది. బెంగాల్ కోసం 60 మంది పేర్లను ఖరారు చేసింది. మరోవైపు, తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సైతం ఈరోజు భేటీ కానుంది.