గల్లీలో కొట్లాట..ఢిల్లీలో దోస్తి
దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం బీజేపీతో గల్లీలో కొట్లాడినట్టు నటిస్తూ..ఢిల్లీలో దోస్తాన్ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరోనా విషయంలో కేంద్రం రాజకీయం చేసిందన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బలరాం నాయక్‌తో కలిసి పొన్నం మాట్లాడారు. మోడీ ఏడాది పాలనలో త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం వివాదం పరిష్కారించామని కేంద్ర సహాయ కిషన్ రెడ్డి చెబుతున్న 3అంశాలు ప్రజల […]
దిశ, న్యూస్‌బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం బీజేపీతో గల్లీలో కొట్లాడినట్టు నటిస్తూ..ఢిల్లీలో దోస్తాన్ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరోనా విషయంలో కేంద్రం రాజకీయం చేసిందన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బలరాం నాయక్‌తో కలిసి పొన్నం మాట్లాడారు. మోడీ ఏడాది పాలనలో త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం వివాదం పరిష్కారించామని కేంద్ర సహాయ కిషన్ రెడ్డి చెబుతున్న 3అంశాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేవని ఆగ్రహం వ్యక్తంచేశారు.అలాగే రాష్ట్రంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నా టీఆర్‌ఎస్, బీజేపీలు ఢిల్లో దోస్తికడుతున్నాయని వివరించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌కు తీసుకువస్తున్న ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని గుర్తుచేశారు. మోడీ పాలనలో రైతులకు ఏమీ మేలు జరిగింది? ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ప్రధాని ఏడాది పాలనలో తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర ఏంతుందో శ్వేతపత్రం విడుదల చేయాలి పొన్నం డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. ట్రైబల్ ఏరియాలో జీవో 3 చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఏపీ సీఎం జగన్ జీవో 3 కొనసాగించాలని సుప్రీంకోర్టుకు వెళ్లారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.అదే విధంగా తెలంగాణలో గిరిజన మంత్రులు ఎందుకు స్పందించడం లేదో తెలపాలన్నారు.