ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి

దిశ, గజ్వేల్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. దుబ్బాక మారమ్మ గుడి నుండి దుబ్బాక మున్సిపల్ ఆఫీస్ వరకు మంజూరు అయిన రోడ్డు విషయంలో కోటి రూపాయలను టీఆర్ఎస్ పార్టీ కాజేసిందని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. అసలు టెండర్ పూర్తి కాకుండా ఎలా కాజేశామో బీజేపీ పార్టీ నిరూపించాలని […]

Update: 2020-10-18 11:33 GMT

దిశ, గజ్వేల్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. దుబ్బాక మారమ్మ గుడి నుండి దుబ్బాక మున్సిపల్ ఆఫీస్ వరకు మంజూరు అయిన రోడ్డు విషయంలో కోటి రూపాయలను టీఆర్ఎస్ పార్టీ కాజేసిందని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. అసలు టెండర్ పూర్తి కాకుండా ఎలా కాజేశామో బీజేపీ పార్టీ నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారికి ఏమి చేయాలో అర్ధం కాకా ప్రస్టేషన్ లో దుబ్బాక ప్రజలకే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. వారిపై ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేశామని తెలిపారు.

Tags:    

Similar News