మరిన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మరిన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. కేరళలో 61 వేల పక్షులు మృత్యువాత పడ్డారు. హర్యానాలోని పంచ్‌కుల ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను జమ్ముకశ్మీర్ నిషేధించింది. ఈ నెల 14 వరకు నిషేధాజ్ఞలు అమలులో […]

Update: 2021-01-07 21:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మరిన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. కేరళలో 61 వేల పక్షులు మృత్యువాత పడ్డారు. హర్యానాలోని పంచ్‌కుల ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.

మరోవైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను జమ్ముకశ్మీర్ నిషేధించింది. ఈ నెల 14 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

Tags:    

Similar News