One More Virus From China : చైనాలో మరో వైరస్..
బీజింగ్: చైనా నుంచి మరో ఆందోళనకర రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. తొలిసారి ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ కేసు నమోదైనట్టు తెలిపింది. జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ హెచ్10ఎన్3 సోకిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, డిశ్చార్జ్ చేయడానికి అనుకూలమైన సామర్థ్యం ఉన్నదని ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్ టీవీ పేర్కొంది. బర్డ్ […]
బీజింగ్: చైనా నుంచి మరో ఆందోళనకర రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. తొలిసారి ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ కేసు నమోదైనట్టు తెలిపింది. జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ హెచ్10ఎన్3 సోకిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, డిశ్చార్జ్ చేయడానికి అనుకూలమైన సామర్థ్యం ఉన్నదని ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్ టీవీ పేర్కొంది.
బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదా కొన్ని వన్యపక్షుల్లో అధికంగా కనిపిస్తుంది. కానీ, తొలిసారి ఈ కేసు మానవుల్లో కనిపించింది. కరోనా వైరస్ కూడా తొలిసారిగా ఇదే దేశంలో రిపోర్ట్ కావడంతో ప్రపంచమంతా మరొక్కసారి ఉలిక్కిపడింది. కానీ, ఈ బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌తో భయపడాల్సిందేమీ లేదని, అప్పుడప్పుడు అరుదుగా ఇలాంటి కేసులు పౌల్ట్రీ ఇండస్ట్రీల్లో పనిచేసే వారిలో కనిపిస్తుంటాయని చైనా వైద్యారోగ్యవర్గాలు కొట్టిపారేశాయి. ఇది మహమ్మారిగా మారే అవకాశాలు అత్యల్పమని వివరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్10ఎన్3 స్ట్రెయిన్ మానవులకు సోకలేదు. మే 28న ఈ కేసును గుర్తించినట్టు కమిషన్ వెల్లడించింది.