Traffic Jam: శ్రీశైలం వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్
శని, ఆదివారాలతో పాటు అంబేద్కర్ జయంతి సందర్భంగా వరుస సెలువులు రావడంతో ప్రకృతి ప్రేమికులు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శని, ఆదివారాలతో పాటు అంబేద్కర్ జయంతి సందర్భంగా వరుస సెలువులు రావడంతో ప్రకృతి ప్రేమికులు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు శ్రీశైల (Srisailam) మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. దీంతో నాగర్ కర్నూల్ (Nagar Karnool) జిల్లా అమ్రాబాద్ (Amrabad) మండల పరిధిలోని సలేశ్వరానికి (Saleshwaram) వెళ్లే భక్తులతో శ్రీశైలం (Srisailam) మెయిన్ హైవే వాహనాతో కిక్కిసిపోయింది. మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur Checkpost) వద్ద సలేశ్వరం (Saleswaram) వెళ్లే వాహనాలకు టోల్ వసూలు చేస్తుండటంతో ఒక్కో వాహనం ముందుకు కదలడం ఇబ్బందిగా మారింది. తాజా సమాచారం మేరకు వాహనాలు చెక్‌పోస్టు (Checkpost) నుంచి సుమారు 6 కి.మీ మేర ఆగిపోయి.. సిద్ధాపూర్ (Siddapur) X రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. ఈ మేరకు లోకల్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.