బయోడైవర్సిటీ ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ప్రారంభం
దిశ, న్యూస్‌బ్యూరో: బయోడైవర్సిటీ జంక్షన్‌లో రూ.30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌ను గురువారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీఈ జియాఉద్దీన్, ఎస్ఆర్‌డీపీఎస్ఈ వెంకటరమణ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్డీపీ ప్యాకేజీ -4 […]
దిశ, న్యూస్‌బ్యూరో: బయోడైవర్సిటీ జంక్షన్‌లో రూ.30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌ను గురువారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీఈ జియాఉద్దీన్, ఎస్ఆర్‌డీపీఎస్ఈ వెంకటరమణ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్డీపీ ప్యాకేజీ -4 కింద రూ.379కోట్లతో ఆరు పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్యాకేజీలో చివరిదైన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు దాదాపు 12 కిలోమీటర్ల కారిడార్ వినియోగంలోకి వచ్చింది.