అంతా మా ఇష్టం.. భద్రాచలంలో బిల్ కలెక్టర్‌ల దందా..

దిశ, భద్రాచలం : భద్రాచలం గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ల హవా నడుస్తోంది. గత పది, పదిహేనేళ్ళ నుంచి బదిలీలు లేకుండా ఇక్కడే పనిచేయడం వలన పంచాయతీ మీద పట్టు సాధించారు. చివరకు పంచాయతీ కార్యదర్శిని సైతం తెలివిగా తప్పుదారి పట్టించి, తమకున్న రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంచాయతీకి చెడ్డపేరు తెస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్ కలెక్టర్ల వలన తనకే ఓ చేదు అనుభవం ఎదురైందని భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కోన ఆనంద్‌ […]

Update: 2021-09-15 07:19 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ల హవా నడుస్తోంది. గత పది, పదిహేనేళ్ళ నుంచి బదిలీలు లేకుండా ఇక్కడే పనిచేయడం వలన పంచాయతీ మీద పట్టు సాధించారు. చివరకు పంచాయతీ కార్యదర్శిని సైతం తెలివిగా తప్పుదారి పట్టించి, తమకున్న రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంచాయతీకి చెడ్డపేరు తెస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్ కలెక్టర్ల వలన తనకే ఓ చేదు అనుభవం ఎదురైందని భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కోన ఆనంద్‌ కుమార్ తెలిపారు.

అన్ని రకాల పత్రాలు ఉన్నా అభ్యంతరం..

స్వాతంత్య్రానికి పూర్వం నుంచి తమ కుటుంబానికి ఉన్న 26 సెంట్ల పట్టాభూమికి సంబంధించి అన్ని రకాల పత్రాలు ఉన్నాయని ఆనంద్‌ కుమార్ తెలిపారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా స్థలంలో ఉన్న 10-1-153/E ఇంటికి ఇంటిపన్ను కట్టడానికి తను బుధవారం ఆఫీసుకి వెళితే ఎవరో(పేరు చెప్పకుండా.. అభ్యంతరం పెట్టిన లెటర్ చూపకుండా) ఓ వ్యక్తి అబ్జక్షన్ చెప్పారని.. ఈ క్రమంలో ఇంటిపన్ను ఆపేశామని బిల్ కలెక్టర్లు తెలిపారు.

ఆ భూమి, అందులో ఉన్న ఇంటికి సంబంధించిన పత్రాలు అన్నింటినీ కార్యదర్శికి చూపించడంతో చివరకు కార్యదర్శి సూచనతో ఇంటిపన్ను కట్టించుకున్నారని ఆనంద్‌కుమార్ తెలిపారు. బిల్ కలెక్టర్లు తన ముందే కార్యదర్శిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బిల్ కలెక్టర్లు తమకు అనుకూలమైన వారైతే సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా ఇంటి పన్నులకు సిఫార్సు చేస్తారని, లేకపోతే ఇంటి పన్నులు ఇవ్వకుండా ప్రజలను ఇలా ఇబ్బందులు పెడుతుంటారని తనకు జరిగిన అనుభవమే తేటతెల్లం చేస్తోందన్నారు.

తక్షణమే విచారించాలి.. బదిలీలు చేయాలి..

భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంవత్సరాల తరబడి బదిలీలు లేకుండా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇక్కడ ఇష్టం వచ్చినట్లు ఇంటి పన్నులు మార్చడం, ఇష్టం వచ్చిన వాటికి ఇంటి పన్నులు మంజూరు చేయడం, యజమానులకు చెప్పకుండా ఇంటి పనులు నిలిపివేయడం సర్వసాధారమైందని ఆనంద్‌ కుమార్ ఆరోపించారు. ఇటువంటి బిల్ కలెక్టర్ల.. బాధితులు పట్టణంలో చాలామంది ఉన్నారని.. దయతో పూర్తి స్థాయి విచారణ జరిపాలని కోరారు. ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులను తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ డీపీవో, భద్రాచలం తహసీల్దార్, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌లకు ఫిర్యాదు పంపినట్లు ఆనంద్‌ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News