తోటి ఉద్యోగిని చెప్పుతో కొట్టిన జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

దిశ, న‌ల్ల‌గొండ‌: నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు గ్రామపంచాయతీ కార్యాలయంలో సబార్డినేట్ డి.వెంక‌టేశ్వ‌ర్ల‌ను చెప్పుతో కొట్టిన జూనియర్ అసిస్టెంట్ బ్రహ్మరెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి యాద‌య్య మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంక‌టేశ్వ‌ర్ల‌ను ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డంతో పాటు అంద‌రూ చూస్తుండ‌గానే చెప్పుతో కొట్టిన‌ట్టు వీడియా కూడా ఉండ‌టంతో అధికారులు విచారణ చేపట్టారు.ఈ నేపథ్యంలోనే బ్ర‌హ్మ‌రెడ్డిపై సస్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్టు యాదయ్య స్పష్టం చేశారు. కాగా వెంక‌టేశ్వ‌ర్లు విధుల‌కు హాజరుకాకుండా అడెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్ట‌డం […]

Update: 2020-04-07 08:06 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌: నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు గ్రామపంచాయతీ కార్యాలయంలో సబార్డినేట్ డి.వెంక‌టేశ్వ‌ర్ల‌ను చెప్పుతో కొట్టిన జూనియర్ అసిస్టెంట్ బ్రహ్మరెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి యాద‌య్య మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంక‌టేశ్వ‌ర్ల‌ను ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డంతో పాటు అంద‌రూ చూస్తుండ‌గానే చెప్పుతో కొట్టిన‌ట్టు వీడియా కూడా ఉండ‌టంతో అధికారులు విచారణ చేపట్టారు.ఈ నేపథ్యంలోనే బ్ర‌హ్మ‌రెడ్డిపై సస్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్టు యాదయ్య స్పష్టం చేశారు. కాగా వెంక‌టేశ్వ‌ర్లు విధుల‌కు హాజరుకాకుండా అడెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్ట‌డం వ‌ల్ల‌ే ఈ వివాదం త‌లెత్తిన‌ట్టు విచార‌ణలో తేలింది. విధుల‌కు హాజరుకాకుండా సంత‌కాలు పెట్ట‌డం ప్రభుత్వ నియ‌మ నిబంధ‌నలు ఉల్లంఘించడమేనని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన వెంక‌టేశ్వ‌ర్ల‌ను ఎందుకు విధుల నుంచి తొల‌గించ‌కూడ‌దో 3రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాల‌ని ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్టు జిల్లా పంచాయ‌తీ అధికారి యాదయ్య తెలిపారు.

Tags: corona, panchayat office, junior assistant suspend,

Tags:    

Similar News