కళ్లు తెరవండి.. కరోనాను తరిమేయండి

దిశ, మునుగోడు: కళ్లు తెరవండి.. కరోనాను తరిమేయండి అంటూ ప్రముఖ మెజీషియన్ రామకృష్ణ భారత్ సందేశ్ యాత్ర పేరుతో తలకు ముసుగు వేసుకొని హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు బైక్ యాత్రను ప్రారంభించారు. శుక్రవారం పాతబస్తీలోని చార్మినార్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర మధ్యాహ్నానికి చౌటుప్పల్‌కు చేరుకుంది. రామకృష్ణ స్వగ్రామం చౌటుప్పల్ మండలం లక్కారం కావడంతో బైక్ యాత్రను ఆయన ఇక్కడ కొద్దిసేపు ఆపి మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో కళ్లున్న జనాలు విచ్చలవిడిగా […]

Update: 2021-03-19 09:33 GMT

దిశ, మునుగోడు: కళ్లు తెరవండి.. కరోనాను తరిమేయండి అంటూ ప్రముఖ మెజీషియన్ రామకృష్ణ భారత్ సందేశ్ యాత్ర పేరుతో తలకు ముసుగు వేసుకొని హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు బైక్ యాత్రను ప్రారంభించారు. శుక్రవారం పాతబస్తీలోని చార్మినార్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర మధ్యాహ్నానికి చౌటుప్పల్‌కు చేరుకుంది. రామకృష్ణ స్వగ్రామం చౌటుప్పల్ మండలం లక్కారం కావడంతో బైక్ యాత్రను ఆయన ఇక్కడ కొద్దిసేపు ఆపి మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో కళ్లున్న జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. వారికి అవగాహన కల్పించేందుకే ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టానన్నారు. 31 రోజుల వ్యవధిలో దేశంలోని 19 రాష్ట్రాలల్లోని చారిత్రక కట్టడాలను సందర్శిస్తూ కాశ్మీర్‌కు చేరుకుంటానని రామకృష్ణ తెలిపారు. సుమారు 10 వేల కిలోమీటర్లు తన యాత్ర ఉంటుందని, అక్కడక్కడా కరోనా, ట్రాఫిక్, పర్యావరణ పరిరక్షణల‌పై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తానని తెలిపారు. రామకృష్ణకు తహసీల్దార్ గిరిధర్, మున్సిపల్ కౌన్సిలర్ సైదులు గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి ఘనస్వాగతం పలికారు.

Tags:    

Similar News