బైకుల చోరీ గ్యాంగ్ అరెస్టు.. 30వాహనాల రికవరీ

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైకుల చోరీకి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు నిందితులు ఉండగా, అందులో నలుగురు మైనర్లు ఉన్నారు. లాక్‌డౌన్ తర్వాత గడిచిన నాలుగు నెలల్లోనే వీరు 30 బైకు దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ నంది ముసలైగూడకు చెందిన చిన్ననాటి స్నేహితులు పదోతరగతిని మధ్యలోనే ఆపేశారు. మద్యం, గంజాయి తదితర […]

Update: 2020-11-13 12:25 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైకుల చోరీకి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు నిందితులు ఉండగా, అందులో నలుగురు మైనర్లు ఉన్నారు. లాక్‌డౌన్ తర్వాత గడిచిన నాలుగు నెలల్లోనే వీరు 30 బైకు దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ నంది ముసలైగూడకు చెందిన చిన్ననాటి స్నేహితులు పదోతరగతిని మధ్యలోనే ఆపేశారు. మద్యం, గంజాయి తదితర చెడు అలవాట్లకు బానిస కావడంతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసేవారు.

అయితే, లాక్‌డౌన్ అనంతరం ఆదాయం లేకపోవడంతో మోటారు సైకిల్ దొంగతనాలకు పాల్పడాలని భావించారు. మొత్తం ఏడుగుల సభ్యుల ముఠాను రాజు అనే వ్యక్తి లీడ్ చేస్తున్నాడు. వీరంతా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోనే అత్యధికంగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పలు బైక్ దొంగతనాలు చేశారు. దొంగిలించిన వాహనాలను తెలిసిన వ్యక్తులకు రూ.15 నుంచి రూ.30 వేలకు విక్రయించారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో టూ వీలర్ దొంగతనాలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాజేంద్రనగర్ హైదర్ గూడ వద్ద ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో బైక్ దొంగతనాల గుట్టు రట్టయింది. చోరీకి గురైన వాహనాల్లోరాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 22, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో 3, టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో 2, కుల్సుంపురా పీఎస్ పరిధిలో 1, ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో 1, లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలో 1 ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఏడాది జనవరిలో హైదర్‌గూడలోని జనప్రియ వద్ద ఎస్బీఐ ఏటీఎంను చోరీ చేసేందుకు ప్రయత్నించగా, అలారం మోగడంతో వదిలేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను కోర్టుకు తరలించగా, 4 గురు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Tags:    

Similar News