ప్రారంభమైన బీహార్ మొదటి దశ పోలింగ్

దిశ, వెబ్‎డెస్క్ : బీహార్‌లో మొదటి దశ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 243 స్థానాల్లో తొలివిడతగా 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలివిడతలో జేడీయూ-41, బీజేపీ-29, ఆర్జేడీ- 42, కాంగ్రెస్‌-20, ఎల్జేపీ-41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా […]

Update: 2020-10-27 20:17 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
బీహార్‌లో మొదటి దశ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 243 స్థానాల్లో తొలివిడతగా 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తొలివిడతలో జేడీయూ-41, బీజేపీ-29, ఆర్జేడీ- 42, కాంగ్రెస్‌-20, ఎల్జేపీ-41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రెండో దశ పోలింగ్‌ నవంబర్‌ 3న, మూడో దశ పోలింగ్‌ నవంబర్‌ 7న, ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి.

Tags:    

Similar News