వెండి తెరపై బిగ్ బాస్ ఫేమ్ అరియానా
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 4’ కంటెస్టెంట్లు ఒకరి తర్వత ఒకరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్‌లో చాన్స్‌లు కొట్టేసింది. తాజాగా అరియానా గ్లోరీని లక్కీ చాన్స్ వరించింది. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన యాంకర్ అరియానా బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్నది. ఇప్పుడు హీరోయిన్‌గా మారనుందని సమాచారం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం […]
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 4’ కంటెస్టెంట్లు ఒకరి తర్వత ఒకరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్‌లో చాన్స్‌లు కొట్టేసింది. తాజాగా అరియానా గ్లోరీని లక్కీ చాన్స్ వరించింది. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన యాంకర్ అరియానా బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్నది. ఇప్పుడు హీరోయిన్‌గా మారనుందని సమాచారం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం తెలుస్తోంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తోందని, ఫొటోను చూసి తెలుసుకోవచ్చు. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే అరియానా..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా..బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో ఓ మంచి రోజని, అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థాంక్సని, రాజ్ తరుణ్ నువ్వు అమేజింగని..రాజ్‌తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దీంతోపాటు అన్నపూర్ణ బ్యానర్‌ని హ్యాష్ ట్యాగ్ చేసింది. మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయినట్లు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది.