భూ వాతావరణంలో కొత్తగా బయటపడిన రియాక్టీవ్ పదార్థం.. మనుషులకు మహాప్రమాదం!
ప్రత్యక్ష పరిశీలనను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. Extremely reactive substance has been detected in the Earth.
దిశ, వెబ్‌డెస్క్ః అనంత విశ్వంలో అంతుబట్టని విషయాలు, పదార్థాలు ఎన్నున్నాయో ఊహకు కూడా అందవని అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా భూమి వాతారణంలో అత్యంత ప్రతిస్పందించే పదార్ధపు కొత్త రకం అయిన ఆర్గానిక్ హైడ్రోట్రియాక్సైడ్లు (ROOOH)లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పదార్ధం ఇంతవరకూ మనకి తెలియని ప్రభావాలను కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుమించి, ఇది మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని, లేదంటే ప్రపంచ పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. "అనేక వాతావరణ సంబంధిత RO2 రాడికల్స్ నుండి ROOOH ఏర్పడటం" గురించి ప్రత్యక్ష పరిశీలనను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
ట్రైయాక్సైడ్లు అంటే, మూడు ఆక్సిజన్ పరమాణువులు ఒకదానికొకటి జతచేయబడిన సమ్మేళనాలు. కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం, ట్రైయాక్సైడ్లు వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడతాయి. రెండు ఆక్సిజన్ పరమాణువులు జతచేయబడిన పెరాక్సైడ్‌ల కంటే ట్రైయాక్సైడ్‌లు మరింత రియాక్టివ్‌గా ఉంటాయి. అలాగే, వాతావరణంలో కూడా ట్రైయాక్సైడ్లు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, ఇది ఇప్పటివరకు రుజువు కాలేదు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హెన్రిక్ గ్రుమ్ క్జర్‌గార్డ్ ప్రస్తుత సమాచారం మేరకు, "ఈ సమ్మేళనాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని, అయితే వాటి గురించి మనకు తెలియదు" అని అన్నారు. "కానీ సమ్మేళనాలు ఏర్పడి నిర్దిష్ట సమయం వరకు జీవిస్తాయనే సాక్ష్యం ఇప్పుడు మన దగ్గర ఉంది. కాబట్టి, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడం, అవి ప్రమాదకరంగా మారితే స్పందించడం సాధ్యమవుతుంది," అని చెప్పారు. అయితే, "అవి చాలా ఆక్సీకరణం చెందుతాయి కాబట్టి, అవి మనం ఇంకా వెలికితీయని అనేక ప్రభావాలను కలిగి ఉంటాయి," అన్నారాయన. అధ్యయనం ప్రకారం, ROOOH వాతావరణ జీవితకాలాన్ని నిమిషాల నుండి గంటల వరకు అంచనా వేశారు.