పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్.. మెమో జారీ చేసిన అధికారి

దిశ, డైనమిక్ బ్యూరో : గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా గ్రామ సర్పంచ్‌తో కలిసి సంక్షేమ పథకాలు, తదితర పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థ ఎత్తేయడంతో ధరణి పోర్టల్‌లో భూములను నమోదు చేసే ప్రక్రియ కూడా వీరిపైనే ఉండిపోయింది. ఇలా పంచాయతీ కార్యదర్శులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సందర్భంలో గ్రామాల్లో […]

Update: 2021-09-19 22:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా గ్రామ సర్పంచ్‌తో కలిసి సంక్షేమ పథకాలు, తదితర పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థ ఎత్తేయడంతో ధరణి పోర్టల్‌లో భూములను నమోదు చేసే ప్రక్రియ కూడా వీరిపైనే ఉండిపోయింది.

ఇలా పంచాయతీ కార్యదర్శులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సందర్భంలో గ్రామాల్లో హరితహారంలో మొక్కలు చచ్చిపోయినా దానికి బాధ్యులుగా పంచాయతీ కారదర్శులకు నోటీసులు, సస్పెన్షన్‌లు ఇవ్వడం చూశాం. అయితే, తాజాగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పంచాయతీ అధికారి చేసిన నిర్వాకాన్ని అందరూ విమర్శిస్తున్నారు.

వాట్సప్ గ్రూప్‌లో ఆయన చేసిన మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలో ఉన్న అందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేశారు. ఓ మండల అధికారి ఇలా చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన జారీ చేసిన మెమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News