కేసీఆర్‌కు బిగ్ షాక్.. కేంద్ర నివేదికతో వెలుగులోకి సంచలన విషయాలు

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుండగా.. అసలు చాలా గ్రామాల్లో మౌళిక వసతులే లేవని కేంద్రం నివేదికను వెల్లడించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా అధ్యయనంలో రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో గిరిజన గ్రామాల్లోని మౌళిక వసతులపై విశ్లేషించి ర్యాంకులు ఇచ్చింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ ప్రచురించిన డేటా ప్రకారం.. తెలంగాణలోని […]

Update: 2021-10-22 03:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుండగా.. అసలు చాలా గ్రామాల్లో మౌళిక వసతులే లేవని కేంద్రం నివేదికను వెల్లడించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా అధ్యయనంలో రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో గిరిజన గ్రామాల్లోని మౌళిక వసతులపై విశ్లేషించి ర్యాంకులు ఇచ్చింది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ ప్రచురించిన డేటా ప్రకారం.. తెలంగాణలోని ఉమ్మడి 9 జిల్లాల్లో దాదాపు 1,663 గిరిజన గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రం సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రం ముఖ్యంగా ఏడు కీలకమైన కోణాల్లో విశ్లేషించి ఆయా గ్రామాలకు ర్యాంకులు ఇచ్చింది.

ఈ సందర్భంగా కేంద్ర నివేదికలో రాష్ట్రంలోని జిల్లాల్లో దాదాపు 21 నుంచి 40 శాతం వరకు గ్రామాల్లో.. మౌళిక సదుపాయాల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల్లో వైద్యం, విద్యపైన మాత్రమే అధికంగా దృష్టి పెట్టిందని వెల్లడించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉత్తమ సదుపాయాల కల్పనలో మహబూబ్‌నగర్ జిల్లా.. వసతులు కల్పించని జిల్లాగా ఆదిలాబాద్ జిల్లాని పేర్కొంది.

 

Tags:    

Similar News