గెట్ వెల్ రెమో.. బిగ్ బీ ట్వీట్
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రెమోకు గుండెపోటు రావడంతో యావత్ సినీ ప్రముఖులు ఆందోళనకు గురికాగా, ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సైతం ‘రెమో త్వరగా కోలుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాం’ […]
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రెమోకు గుండెపోటు రావడంతో యావత్ సినీ ప్రముఖులు ఆందోళనకు గురికాగా, ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సైతం ‘రెమో త్వరగా కోలుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాం’ అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
@SrBachchan And The Compliment Given By Remo Is Just So Awesome.@sanjay_patodiya @RajibMittra @ashokmistry4545 @BeejalBhatt @AmitAgrawl @aspalod @JaniJasmine @KalaYadav3 @juniorbachchan @earth2angel pic.twitter.com/6sr62VmEuU
— RoHiT #ABFAKOLKATA (@RoHiTBhUtoRIa) December 13, 2020
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రెమో.. ‘కాంటే, ధూమ్, రాక్ ఆన్, యే జవాని హై దివాని, క్రిష్ 2, కిక్, జీరో, బాజీరావ్ మస్తానీ, భజరంగీ భాయీజాన్’ వంటి చిత్రాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించారు. అంతేకాదు ‘ఫాల్తూ’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ‘రేస్-3, ఏబీసీడీ, ఏ ఫ్లయింగ్ జెట్, స్ట్రీట్ డ్యాన్సర్’ తదితర సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ ప్లస్, ఝలక్ దిక్లాజా’ వంటి డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.