ట్రంప్ విధించిన హెచ్-1బీ బ్యాన్‌కు బైడెన్ స్వస్తి!
వాషింగ్టన్: రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక విదేశీ ఉద్యోగుల వీసాలపై విధించిన నిషేధాన్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ ఎత్తేయనున్నట్టు సమాచారం. తక్కువ వేతనాలకే పనిచేసే విదేశీ వర్కర్లతో అమెరికన్లకు ముప్పు పొంచి ఉన్నదని, దేశంలో నిరుద్యోగిత పెరిగే ప్రమాదమున్నదని డొనాల్డ్ ట్రంప్ తరుచూ చెబుతుండేవారు. ఇందుకు అనుగుణంగా హెచ్-1బీ వీసాలపై 2020 జూన్‌లో నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని మార్చి 31 వరకు అంటే తాను అధ్యక్ష పదవి నుంచి […]
వాషింగ్టన్: రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక విదేశీ ఉద్యోగుల వీసాలపై విధించిన నిషేధాన్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ ఎత్తేయనున్నట్టు సమాచారం. తక్కువ వేతనాలకే పనిచేసే విదేశీ వర్కర్లతో అమెరికన్లకు ముప్పు పొంచి ఉన్నదని, దేశంలో నిరుద్యోగిత పెరిగే ప్రమాదమున్నదని డొనాల్డ్ ట్రంప్ తరుచూ చెబుతుండేవారు. ఇందుకు అనుగుణంగా హెచ్-1బీ వీసాలపై 2020 జూన్‌లో నిషేధం విధించారు.
ఈ నిషేధాన్ని మార్చి 31 వరకు అంటే తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నంత వరకు రెన్యువల్ చేశారు. తాజాగా, ఈ నిషేధం ఈ రోజుతో ముగియనుంది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ లీడర్ జో బైడెన్ ఈ నిషేధం ఎక్స్పైర్ అవ్వడానికి అవకాశమిస్తున్నట్టు ఈ విషయంపై అవగాహన ఉన్న ముగ్గురు అధికారులు వివరించారు. ట్రంప్ తీసుకున్న పలు ఇమ్మిగ్రేషన్ విధానాలను ఇప్పటికే బైడెన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రీన్ కార్డు ధరఖాస్తులపై విధించిన ఆంక్షలనూ ఆయన సడలించారు. తాజాగా, హెచ్-1బీ వీసాలపై నిషేధానికీ ఆస్కారమిస్తున్నారు.