బిడ్డింగ్ జరగడం లేదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కోరింది. కౌంటర్ దాఖలుకు కేంద్రం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈనెల 29న బిడ్డింగ్ కేంద్రం ముందుకు వచ్చిందని […]

Update: 2021-07-23 03:36 GMT

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కోరింది. కౌంటర్ దాఖలుకు కేంద్రం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈనెల 29న బిడ్డింగ్ కేంద్రం ముందుకు వచ్చిందని పిటిషన్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే బిడ్డింగ్ జరగడం లేదని కేంద్రం తరఫున న్యాయవాది తెలిపారు. ఆగస్టు 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా వేసింది.

Tags:    

Similar News