అదంతా అబద్దం : భువనేశ్వర్
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టెస్టుల్లో నుంచి పూర్తిగా తప్పుకున్నాడని.. ఇకపై అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతాడని వచ్చిన వార్తలపై అతడు స్పందించాడు. ఆ వార్తలు అన్నీ అవాస్తవమని.. తాను మూడు ఫార్మాట్ల కోసం సిద్దపడుతున్నట్లు భువీ చెప్పాడు. తనను సెలెక్టర్లు టెస్టుల్లో ఎంపిక చేసినా, చేయకపోయినా.. తాను మాత్రం అన్ని పార్మాట్లలో ఆడటానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్ కుమార్ టెస్టులు ఆడటానికి సుముఖంగా లేనందువల్లే […]
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టెస్టుల్లో నుంచి పూర్తిగా తప్పుకున్నాడని.. ఇకపై అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతాడని వచ్చిన వార్తలపై అతడు స్పందించాడు. ఆ వార్తలు అన్నీ అవాస్తవమని.. తాను మూడు ఫార్మాట్ల కోసం సిద్దపడుతున్నట్లు భువీ చెప్పాడు. తనను సెలెక్టర్లు టెస్టుల్లో ఎంపిక చేసినా, చేయకపోయినా.. తాను మాత్రం అన్ని పార్మాట్లలో ఆడటానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్ కుమార్ టెస్టులు ఆడటానికి సుముఖంగా లేనందువల్లే అతడిని సెలెక్టర్లు ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపిక చేయలేదని ఒక జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.
ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉన్న భువీని పక్కన పెట్టడానికి కారణం.. అతడు టెస్టుల్లో ఆడటానికి ఆసక్తి చూపించకపోవడమే అని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై భువీ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘తాను టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించడం లేదని వచ్చిన వార్తలు వస్తున్నాయి. నేను అన్ని ఫార్మాట్ల కోసం సిద్దపడుతున్నాను. దయచేసి మీ ఊహాగానాలను సోర్స్ పేరుతో కథనాలు ప్రచురించవద్దని నా సూచన’ అని ఘాటుగా పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్ చివరి సారిగా 2018లో సౌతాఫ్రికా పర్యటనలోటెస్ట్ మ్యాచ్ఆడాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో తిరిగి జట్టులో చేరాడు.