రిషబ్ పంత్ కు 27 కోట్ల దండగ.. సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 ) ... లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Gian

Update: 2025-04-12 14:26 GMT
రిషబ్ పంత్ కు 27 కోట్ల దండగ.. సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ !
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 ) ... లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) కెప్టెన్ రిషబ్ పంత్ ( rishabh pant) అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెంట్స్ కు... ఏ మాత్రం రిషబ్ పంత్ ( rishabh pant) న్యాయం చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ లో అత్యధిక ధర పలికి.. ఇప్పుడు దారుణంగా విఫలం కావడంతో రిషబ్ పంత్ అభిమానులు కూడా జీర్ణించుకోవడం లేదు.

ఈ మెగా టోర్నమెంట్ లో.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన రిషబ్ పంత్...0, 15, 2,2,21 పరుగులు మాత్రమే చేశాడు. 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ లో కూడా 27 పరుగులు కూడా దాటలేదు. అటు వికెట్ కీపింగ్ లోను అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు రిషబ్ పంత్ ( rishabh pant).

దాదాపు ఈ టోర్నమెంట్ లో 80% క్యాచ్ లను మిస్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) జట్టును గెలిపించేందుకు ఏమాత్రం కృషి చేయడం లేదు అంటూ రిషబ్ పంత్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నికోలస్ పూరన్ ( Nicholas Pooran) ఒక్కడే లక్నో గెలిపించేందుకు చాలా కష్టపడుతున్నాడని చెబుతున్నారు. ఇకనైనా మ్యాచ్ గెలిపించేందుకు... పంత్ కష్టపడాలని.. కోరుతున్నారు.

Tags:    

Similar News