పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి భువీ..?

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్నది. గత కొన్ని సిరీస్‌లుగా క్రికెట్ ఆడుతున్న జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇండియాలో ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడుతూ జట్టు అవసరాలు తీరుస్తున్నాడు. ప్రధాన పేసర్లు మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో భారమంతా జస్ప్రిత్ బుమ్రాపైనే పడింది. అయితే […]

Update: 2021-02-17 07:58 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్నది. గత కొన్ని సిరీస్‌లుగా క్రికెట్ ఆడుతున్న జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇండియాలో ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడుతూ జట్టు అవసరాలు తీరుస్తున్నాడు. ప్రధాన పేసర్లు మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో భారమంతా జస్ప్రిత్ బుమ్రాపైనే పడింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు భువనేశ్వర్‌కుమార్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారు. వాస్తవానికి చివరి రెండు టెస్టుల్లోనే బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని అనుకున్నా.. పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకుండా పోయినందువల్ల బుమ్రాను కొనసాగించక తప్పలేదు. షమీ గాయం నుంచి కోలుకున్నా.. ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. దీంతో భువీ, షమీ ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్‌కు అందుబాటులో ఉంటారని.. వారిద్దరికి తోడు నటరాజన్, నవదీప్ సైనీ కూడా జట్టుతో ఉంటారు. దీంతో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

Tags:    

Similar News