మూడు నెలలు రూ.3 వేల చొప్పున అందించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించి ఆదుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2019 లెక్కల ప్రకారం 45లక్షల మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని, వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి పొందుతున్న ఈ రంగానికి […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించి ఆదుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2019 లెక్కల ప్రకారం 45లక్షల మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని, వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి పొందుతున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సాయం చేస్తే ముడి సరుకుల కొనుగోలుతో ఆయా వృత్తుల వారు తిరిగి గాడిలో పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు రూ.3వేల చొప్పున అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.