బ్యాంకర్లకు భూపాలపల్లి కలెక్టర్ ఆదేశాలు
దిశ, భూపాలపల్లి: రైతులకు నిర్ణీత సమయంలోగా పంట రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం సింగరేణి క్లబ్ హౌస్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ఈ జిల్లాలో నిరుపేద రైతులు చాలా మంది ఉన్నారని, వారందరి అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో నిర్ణీత లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలన్నారు.