నేను బాధ్యత తీసుకుంటా.. భూమ మౌనికా రెడ్డి వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే నాటి నుంచి ఎప్పటికప్పుడు మీడియా ముందకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అఖిలప్రియ చెల్లెలు భూమ మౌనికా రెడ్డి, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో ఆదివారం భూమా మౌనిక రెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అఖిల ప్రియ అరెస్టు కుట్ర అని అన్నారు. అఖిల […]

Update: 2021-01-10 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే నాటి నుంచి ఎప్పటికప్పుడు మీడియా ముందకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అఖిలప్రియ చెల్లెలు భూమ మౌనికా రెడ్డి, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో ఆదివారం భూమా మౌనిక రెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అఖిల ప్రియ అరెస్టు కుట్ర అని అన్నారు. అఖిల అరెస్టు వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఉందని వెల్లడించారు. అక్కకు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంతేగాకుండా ఆడపిల్ల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారని, మా అక్కకు బెయిల్ వచ్చాక అందరి పేర్లు బయట పెడతా అని ఆమె హెచ్చరించారు. దీని గురించి, త్వరలోనే రాష్ట్ర గవర్నర్, కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ను కలుస్తా అని అన్నారు. అంతేగాకుండా భూమా కుటుంబం నుంచి నేను బాధ్యత తీసుకుంటాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తే అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడకండి అని ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News