ఆ పెళ్లిలో.. స్ట్రీట్ డాగ్స్‌‌కు విందు భోజనం

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో ‘వెడ్డింగ్ సెలెబ్రేషన్స్’ చాలా గ్రాండ్‌గా జరుగుతుంటాయి. తమ పెళ్లి వేడుకు గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని అనవసర ఆర్భాటాలకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఈ మూస పద్ధతిని బ్రేక్ చేసి.. సమాజసేవకు, పర్యావరణ పరిరక్షణకు పెళ్లి వేదికను ముడిపెడతారు. ఇటీవలే ఓ అస్సామీ జంట తమ పెళ్లికి వచ్చే అతిథులను బహుమతులుగా పుస్తకాలు తీసుకురమ్మని చెప్పడంతో పాటు, బదులుగా వారికి చెట్లను గిఫ్ట్‌గా అందించి […]

Update: 2020-10-13 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ఇండియాలో ‘వెడ్డింగ్ సెలెబ్రేషన్స్’ చాలా గ్రాండ్‌గా జరుగుతుంటాయి. తమ పెళ్లి వేడుకు గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని అనవసర ఆర్భాటాలకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఈ మూస పద్ధతిని బ్రేక్ చేసి.. సమాజసేవకు, పర్యావరణ పరిరక్షణకు పెళ్లి వేదికను ముడిపెడతారు. ఇటీవలే ఓ అస్సామీ జంట తమ పెళ్లికి వచ్చే అతిథులను బహుమతులుగా పుస్తకాలు తీసుకురమ్మని చెప్పడంతో పాటు, బదులుగా వారికి చెట్లను గిఫ్ట్‌గా అందించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. తాజాగా భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట తమ పెళ్లి వేడుకను ఇంకాస్త వినూత్నంగా నిర్వహించుకుని ఆశ్చర్యపరిచారు.

భువనేశ్వర్‌కు చెందిన యురేక ఆప్టా ఓ ఫిల్మ్ మేకర్ కాగా, అతని ప్రియురాలు జోనా డెంటిస్ట్. మూడేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ తమ పెళ్లిలో స్ట్రీట్ డాగ్స్‌కు మంచి ఫుడ్ ట్రీట్ ఇవ్వాలని ఎప్పుడో నిశ్చయించుకున్నారు. వారి ప్రేమలో రోజులు, సంవత్సరాలు గడిచిపోయి చివరకు మూడు ముళ్లు వేసే సమయం రానే వచ్చింది. కానీ వాళ్లనుకున్న మాట మాత్రం మరిచిపోలేదు. తాము ఒక్కటవుతున్న శుభసందర్భంగా.. వాలంటరీ ఆర్గనైజేషన్ ‘ఎనిమల్ వెల్‌ఫేర్ ట్రస్ట్ ఎకమ్ర’.. సాయంతో 500 శునకాలకు మంచి భోజనం పెట్టించారు. అంతేకాదు.. రెస్క్యూ చేసిన కొన్ని జంతువులకు షెల్టర్ కోసం కొంత డబ్బులు కూడా దానం చేశారు. వాళ్ల పెళ్లికి రెండు రోజుల ముందు ఆ ట్రస్ట్‌కు వెళ్లి, జంతువులకు అవసరమైన ఫుడ్ ఐటెమ్స్, మెడిసిన్స్ కూడా అందించారు.

యురేక విషయానికొస్తే.. జార్ఖండ్, ఒడిసాకు చెందిన రూరల్ ఏరియాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీలు రూపొందించే ప్రాజెక్టులు వచ్చాయి. కానీ పాండమిక్ వల్ల వాటిని కోల్పోయాడు. దాంతో ఆ జంట కొంత మొత్తం బ్యాంకు నుంచి లోన్ తీసుకుని మరీ తామనుకున్న సేవా కార్యక్రమాలను తమ పెళ్లిరోజున చేసి అందరితో అభినందనలు అందుకున్నారు. ‘జోనా పెళ్లి కోసం ఖరీదైన చీర కూడా కొనుక్కోకుండా వాళ్ల అమ్మ పెళ్లి చీరే కట్టుకుంది.

Tags:    

Similar News