Bhoopal Reddy: శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి (శుక్రవారం)నుంచి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీ కాలం గురువారంతో ముగిసింది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. మండలికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి (శుక్రవారం)నుంచి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీ కాలం గురువారంతో ముగిసింది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు.
మెదక్ జిల్లా నుంచి భూపాల్ రెడ్డి శాసనమండలి సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. మేడక్ జిల్లా రామచంద్రపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, 2007-2014 , 2014-2015 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీగా 2016-2022 వరకు కొనసాగనున్నారు.