ఇసుకలోని ఆలుతో స్నాక్స్

దిశ,వెబ్ డెస్క్ : తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషి అని సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం సమాజంలో కేవలం రుచి కోసమే అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మన తెలంగాణలో సకినాలు ఎలానైతే ప్రత్యేకమో రాష్ట్రాల్లో ఒక్కోప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన వంట ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక మైన వంటలు మనం సోషల్ మీడియ ద్వారా చూస్తాం. అయితే ఇలానే ఒక వంట నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఏం వంట […]

Update: 2021-04-01 23:36 GMT

దిశ,వెబ్ డెస్క్ : తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషి అని సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం సమాజంలో కేవలం రుచి కోసమే అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మన తెలంగాణలో సకినాలు ఎలానైతే ప్రత్యేకమో రాష్ట్రాల్లో ఒక్కోప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన వంట ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక మైన వంటలు మనం సోషల్ మీడియ ద్వారా చూస్తాం. అయితే ఇలానే ఒక వంట నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఏం వంట అనుకుంటున్నారా ? మనం ఆలుని ముక్కలు కోసి, నూనెలో వేసి చిప్స్, ఇతర వేయించిన పదార్థాలు తయారు చేసుకుంటాం.

కానీ భునా ఆలూ అనే స్నాక్స్‌ను ఇసుకలో వేయించి తయారు చేస్తారని ఇది ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన స్నాక్స్ అని ఒక బ్లాగర్‌ తెలిపాడు. దీని తయారీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ కొత్త వంటకాన్ని ఇసుకలో వేయించి చేస్తారు. పెద్ద పెనంలో నూనెకు బదులుగా ఇసుక వేసి బాగా వేడిచేస్తారు. దీంట్లో తాజా బంగాళాదుంపలను వేసి అన్ని వైపులా వేడి తగిలేలా కలుపుతారు. సుమారు 20 నిమిషాలపాటు ఇలా వేయిస్తారు. దుంపల పొట్టు నలుపు రంగులోకి మారిన తరువాత వాటిని బయటకు తీస్తారు. పొట్టు తీసి ప్రత్యేకమైన మసాలా పొడి, బటర్‌, చట్నీతో వడ్డిస్తారు.

Tags:    

Similar News